రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఈ ఐపీఎల్ సీజన్ లో ఉత్సాహం చూపిస్తోంది. ప్రధానంగా ఐపీఎల్ విజేతలుగా నిలిచిన జట్లను ఓడిస్తోంది ఆర్సీబీ. మొదటి రెండు మ్యాచుల్లోనూ ఘన విజయం సాధించిన ఆర్సీబీ మూడో మ్యాచ్ కోసం గుజరాత్ టైటాన్స్ ను ఢీకొట్టేందుకు రెడీ అయిపోతోంది. మొదటి మ్యాచ్ లో ఢిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ ను ఓడించిన ఆర్సీబీ...రెండో మ్యాచులో మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కి చెపాక్ లోనే షాక్ ఇచ్చింది. మరి ఈరోజు మ్యాచ్ ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ దగ్గర ఐపీఎల్ ట్రోఫీ ఉంది కాబట్టి...లెక్క ప్రకారం గుజరాత్ ను ఆర్సీబీ ఓడించాలి. పాయంట్ల పట్టికల మొదటి స్థానంలో ఉన్న ఆర్సీబీకి...నాలుగో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కి తేడా ఒక్క విజయమే కాబట్టి రెండు టీమ్స్ విన్నింగ్ కోసం తీవ్రంగా కృషి చేస్తాయి. జట్ల విషయానికి వస్తే ఇద్దరికీ బౌలింగ్ యూనిటే బలం. ఆర్సీబీలో జోష్ హేజిల్ వుడ్ కి తోడుగా భువన్వేశ్వర్, యశ్ దయాల్ పేస్ బాధ్యతలన పంచుకుంటుంటే కృనాల్, సూయాశ్ శర్మ స్పిన్ బాధ్యతలను చూసుకుంటారు. ఇక బ్యాటింగ్ లో కింగ్ కొహ్లీ కి తోడుగా ఫామ్ లో రజత్ పాటిదార్ కూడా మరొక్కసారి విరుచుకుపడితే ఆర్సీబీ భారీ స్కోరే చేయొ్చు. మరో వైపు గుజరాత్ లోనూ అంతే రబాడాకు తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ రెండు వైపుల నుంచి ఎటాక్ చేయటానికి రెడీగా ఉన్నారు. స్పిన్ కోసం రషీద్ ఖాన్ కి తోడుగా వాష్టింగ్టన్ సుందర్ ను తీసుకుంటారేమో చూడాలి. బ్యాటింగ్ లో అయితే గుజరాత్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. గిల్, బట్లర్, సాయి సుదర్శన్ మరోసారి చెలరేగిపోవాలని కోరుకుంటుంది. చూడాలి మరి కింగ్, ప్రిన్స్ ల పోరాటంలో గెలుపుఎవరిదో.